Telangana Local Body Elections: తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మాట మార్చిన మంత్రి సీతక్క..

Telangana Local Body Elections: తెలంగాణ మంత్రి సీతక్క తూచ్ అంటూ తాను చెప్పిన మాటనే తప్పారు.  తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ను వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గంటలు గడవక ముందే.. మంత్రి సీతక్క మాట మార్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 14, 2025, 08:09 AM IST
Telangana Local Body Elections: తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మాట మార్చిన మంత్రి సీతక్క..

Telangana Local Body Elections:లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులిస్తామని చెప్పారు.  ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో.. జులైలో  స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు గతేడాది జులై మొదటి వారంలో.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు  ఏప్రిల్ లోనే  ముగిశాయి. ఈ సందర్బంగా లోకల్ బాడీకి ఎన్నికలను వారం పది రోజుల్లో  నిర్వహిస్తామని చెప్పిన సీతక్క వెంటనే మాట మార్చారు. నిన్న మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పిన సీతక్క. అయితే ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో యూ టర్న్ తీసుకున్నారు సీతక్క. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేని చెప్పుకొచ్చారు.  

వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుంది అని మాత్రమే తాను చెప్పారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పానన్నారు. ఏది ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పై సీతక్క చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News