New Telangana Cabinet Ministers: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ పచ్చజెండా ఊపింది. ఈ వారంలోనే కొత్త మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి ఆరుగురు నేతలకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇందులో ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, వాకిటి శ్రీహారి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయని లీకులు వస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో మరో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మరికొందరు మంత్రులు కూడా తమకు శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ శాఖలను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
పలువురు మంత్రుల శాఖలను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో మంత్రుల శాఖలు మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు చెబుతున్నారు. అయితే మంత్రుల పనితీరు ఆధారంగానే శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని టాక్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వద్ద సివిల్ సఫ్లై, ఇరిగేషన్ శాఖలు ఉన్నాయి. కానీ ఈ శాఖలు వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారట. తనకు హోంమంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎంను కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలకు ఓకే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు హోంశాఖను ఇప్పించేందుకు హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది..
మరోవైపు నల్గొండ జిల్లాకు చెందని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సేమ్ సిచ్యూయేషన్.. ఆయన కూడా తనకు కేటాయించిన శాఖలపై నారజ్ అవుతున్నారట. ప్రస్తుతం ఆర్ ఆండ్ బీ, సినిమాటో గ్రఫీ శాఖలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి.. ఈ రెండు శాఖలు తనకు వద్దని అంటున్నారట. ప్రస్తుతం ఆర్ అండ్ బీ శాఖను పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఆయనకు సొంత శాఖలో అధికారులను సహకరించడం లేదని తెలుస్తోంది. అటు సినిమాటోగ్రఫీ శాఖను నిర్వర్తించడం కూడా ఆయనకు ఇష్టం లేదట. అందుకే తన శాఖలను మార్చమని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎక్సైజ్ శాఖను జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్నారు. ఆయన్ను కేబినెట్ నుంచి బయటకు పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది. జూపల్లిని తప్పించిన తర్వాత.. ఆయన శాఖను మరొకరికి కేటాయించే ఆలోచన చేస్తున్నారట. అలాగే ప్రస్తుతం రెండేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల వద్ద నుంచి కొన్ని శాఖలను కొత్త నేతలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని సమాచారం. అటు కొండా సురేఖను కూడా కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఈమె స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతికి మంత్రిగా అవకాశం ఇస్తారని టాక్ వినిపిస్తోంది. విజయశాంతి తనకు హోంశాఖ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు టాక్.. ఆమెకు హోంశాఖ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్టు ఢిల్లీలో టాక్ వినిపిస్తోంది.
మొత్తంమీద ఈనెల మూడో తేదీన మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్నారు. అదేరోజున మంత్రులకు శాఖలకు కేటాయింపులతో పాటు.. పాత మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందట. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: Trump Tariffs Fears: భారత్ నెత్తిన ట్రంప్ పిడుగు.. మరికొన్ని గంటల్లో ట్యాక్స్ బాంబ్
Also Read: Ration Cards: రేషన్ కార్డులపై అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్త కార్డులు ఎలా ఉంటాయో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









