Telangana MLAs Defection Case: తెలంగాణలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ అనర్హత వేటు విషయమై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు తలంటు పోసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ తరుపున ముకుల్ రోహిత్గి కీలక వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ఈ సందర్భంగా తెలిపారు. సభాపతి ఒకసారి నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్షకు అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం సరికాదన్నారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించలేమా అని జస్టిస్ గవాయ్ ముకుల్ రోహిత్గిని ప్రశ్నించారు.
కోర్టులు రాజ్యంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయన్న న్యాయమూర్తి... స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.ఇక బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జనవరి 15న బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే అందులో గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కొందరు సొంత పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే.. కాంగ్రెస్ పార్టీ తరుపున గత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఆయనపై అనర్హత వేటు పడటం గ్యారంటీ అని చెబుతున్నారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో చూడాలి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









