Telangana: తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం చెందింది. ఇప్పటికే ఒకసారి గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈసారి తప్పకుండా స్పందించాలని ఆదేశించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పది మందిపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని, అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంకెంత కాలం గడువు కావాలి, ఐదేళ్ల కాలం ముగిసే వరకూ కావాలా అంటూ మండిపడింది. ఈ నెల 25న ఈ కేసులో కీలక విచారణ జరగనుంది. దాంతో గత విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి, అసెంబ్లీ సెక్రటరీకు, 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చ్ 22 అంటే నిన్నటి వరకూ స్పందించాల్సి ఉంది. కానీ సమాధానం లేకపోవడంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే కేసులో తెలంగాణ హైకోర్టు 4 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్పీకర్ పట్టించుకోలేదు. ఆ తరువాత కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో కీలకమైన విచారణ మార్చ్ 25న జరగనుంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడితే తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Also read: Rain Alert: హైదరాబాద్ ప్రజలకు వార్నింగ్, రానున్న 24 గంటల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









