Telangana MLC Elections: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 10 రౌండ్ వరకు 4వేల ఓట్ల లీడ్‌లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. రెండో ప్లేస్‌లో కాంగ్రెస్ (All Inida Congress) అభ్యర్థి నరేంద్ర రెడ్డి కొనసాగుతున్నారు. పదవ రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి ముందంజలో ఉన్నారు.
రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి లీడ్ కనబర్చిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికి రౌండ్ రౌండ్‌కు లీడ్ తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 70వేల 740 ఓట్ల వచ్చాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 66వేల 178 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 2లక్షల 24వేలు కాగా ఇప్పటివరకు సుమారు 2లక్షల 10వేల ఓట్లు లెక్కించారు. మరికొన్ని గంటల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం తేలనుంది. మరి ఈ హోరాహోరి పోరులో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా లేదా కాంగ్రెస్ పార్టీకి దక్కించుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









