Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై క్లారిటీ.. పగ్గాలు అతని చేతికే..!

Telangana BJP President: తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి  ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త అధ్యక్షుడు వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాలేదు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 27, 2025, 08:11 AM IST
Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై క్లారిటీ.. పగ్గాలు అతని చేతికే..!

Telangana BJP President: ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. పూటకో పేరు సోషల్ మీడియాతో పాటు ప్రముఖ వార్తా ఛానెల్స్ లో వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో  తాజాగా కిషన్ రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడంతో.. కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

Add Zee News as a Preferred Source

షెడ్యూలు ప్రకారం.. జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, మురళీధర్‌ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది.  వీరితో పాటు ఇంకొందరు కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేరళ సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్ఠానం మరో రెండు మూడు రోజుల్లో కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించే వరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగనుంది.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News