New Ration Card: తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డులు 2025 మార్గదర్శకాలు, నియమ నిబంధనలను ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
కొత్త రేషన్ కార్డు కోసం ముందుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి 45 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. ఏ మధ్యవర్తుల్ని ఆశ్రయించవద్దని ప్రభుత్వం చెబుతోంది. దరఖాస్తు చేసిన తరువాత సంబంధిత సిబ్బంది మీ ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. రేషన్ కార్డుల జారీ కోసం చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు. త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఇంటి విద్యుత్ బిల్లు లేదా వాటర్ బిల్లు లేదా గ్యాస్ కనెక్షన్ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. పెళ్లయిన కుటుంబ సభ్యుడిని కార్డు నుంచి వేరు చేయాలంటే వివాహ ధృవీకరణ పత్రం అవసరం.
కొత్త రేషన్ కార్డు కోసం కేవలం మీ సేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యవర్తులెవర్నీ నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మార్పులు, చేర్పులు కూడా మీ సేవ పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు జారీ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరూ రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపింది. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న తరువాత సంబంధిత అధికారులు ఇంటికి వచ్చి అన్నీ పరిశీలిస్తారు. అర్హత మేరకు కార్డు జారీ అవుతుంది.
రోజూ ఉదయం 10.30 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతానికి గడువు తేదీ లేకపోయినా ఎంత త్వరగా దరఖాస్తు చేస్తే అంత మంచిది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, విద్యుత్ లేదా వాటర్ బిల్లు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రభుత్వ సిబ్బంది నుంచి వచ్చే ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునేందుకు ఫోన్ అందుబాటులో ఉంచుకోవాలి.
Also read: Solar Eclipse 2025: సూర్య గ్రహణం ఎప్పుడు, ఎన్ని గంటలకు, ఏమేం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









