)
రెండేళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. దీనితో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కేంద్రం ఆడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్ర నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ఇంత కాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో దాదాపు రూ. 3 వేల కోట్ల కేంద్ర నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి.
దీంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనితో పెండింగ్ నిధులను దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్స్‌లోకి జమ చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇంతకాలం కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా పనులు పెండింగ్‌లో పడ్డాయి. పారిశుధ్యం, లైటింగ్ ఏర్పాట్లు, జీతాలు చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు.
Read more: Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు
ఇప్పుడు కేంద్రం నుంచి నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రతినెలా గ్రామాలకు కావాల్సిన ఖర్చులకు ఇబ్బందులు ఉండవని అధికారులు ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్‌కు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందనే ఆశలో మాజీ సర్పంచులు ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.