EC Rani kumudini key statement on Telangana panchayat elections 2025: తెలంగాణలో ప్రస్తుతం మరోసారి ఎన్నికల సందడి నడుస్తొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది మూడు దశల్లో తెలంగాణలో సర్పంచ్ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో రేపు అంటే డిసెంబర్ 11న జరుగుతుండగా, రెండో దశ డిసెంబర్ 14న, మూడో దశ డిసెంబర్ 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తొలి దశలో పొలింగ్ ఏర్పాట్ల పై ఎన్నికల అధికారిణి రాణికుముదినీ మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
ఇప్పటికే పోలింగ్ కు సంబంధించి సామాగ్రి అంతా బూత్ కు తరలించామన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసుల బలగాలను మోహరించాయన్నారు. పూర్తిగా ట్రాన్స్ పరెన్సీగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.
తొలివిడతలో.. 3,834 గ్రామాలు, 27, 628 వార్డుల్లో పొలింగ్ ఉండనుంది. తొలివిడతలో భాగంగా 395, రెండోవిడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎన్నిక జరిగిందన్నారు. మరోవైపు ఎన్నికలు మధ్యాహ్నం 2 కు ముగియగానే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుందన్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎంపిక, ఉపసర్పంచ్ పదవికోసం ఎన్నిక కూడా రేపు ఉంటుందన్నారు.
Read more:Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
ఈ నేపథ్యంలో ప్రజలంతా స్వేచ్చగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. దీంతో కొంత మంది అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నంచేసుకొవడానికి ప్రలోభాల పర్వంకు తెరతీశారు. పోలీసులు ఎక్కడికక్కడ మద్యం, నగదను సీజ్ చేస్తున్నారు. దీంతో తొలిదశ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









