KCR Speech: చెవులు రిక్కరించిన తెలంగాణ.. రజతోత్సవ సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడతారు?

KCR Silver Jubilee Speech Political Parties High Alert: నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం.. రెండున్నర దశాబ్దాల ప్రత్యేకమైన పోరాటం.. పాలన.. పోరాటంగా సాగిన కేసీఆర్‌ స్థాపించిన బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవం చేసుకుంటోంది. ఆయన ఏమి మాట్లాడతారనేది ఉత్కంఠ నెలకొంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 27, 2025, 05:33 PM IST
KCR Speech: చెవులు రిక్కరించిన తెలంగాణ.. రజతోత్సవ సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడతారు?

KCR Speech: రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని అనంతరం ఉద్యమ నాయకుడిగా కొనసాగి అనంతరం ముఖ్యమంత్రిగా.. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ రాజకీయాలను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఉద్యమం.. అధికారం.. ప్రతిపక్షం ఈ మూడు పాత్రల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అలియాస్ టీఆర్‌ఎస్‌ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలుగా చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పవచ్చు.

Add Zee News as a Preferred Source

Also Read: BRS Party: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ.. కొన్ని నిమిషాల్లో చేరుకోనున్న కేసీఆర్

దశాబ్దాలుగా సాధ్యం కాని తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష.. కలను సాకారం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌.. దాన్ని సుసాధ్యం చేసిన రాజకీయ దురంధరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే ఎంతో ప్రక్రియ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆమోదం లభించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి.. మెప్పించి తెలంగాణ సాధించడం కేసీఆర్‌తోనే సాధ్యం. గతంలో ఏ నాయకుడు కూడా ఒక రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బహుశా ఎవరికీ లేదు. అలాంటి పార్టీ.. ఆ నాయకుడు కేసీఆర్‌ రజతోత్సవం చేసుకుంటున్నారు.

Also Read: BRS Party Meeting: 'తెలంగాణ రాజకీయాల్లో వరంగల్‌ సభతో సరికొత్త చరిత్ర': కేటీఆర్‌

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరుగుతున్న బాహుబలి సభలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఏం మాట్లాడుతారు? ఆయన మదిలో ఏముంది? అనేది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే కేసీఆర్‌ రజతోత్సవ సభ వేదిక నుంచి ఎలాంటి ప్రసంగం చేస్తారోనని ఒక్క తెలంగాణనే కాదు పక్క రాష్ట్రం ఏపీతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఎల్కతుర్తి సభ నుంచి కేసీఆర్‌ కీలక ప్రసంగం చేయనున్నారని తెలుస్తోంది. దాదాపు గంట పాటు మాట్లాడతారని సమాచారం. తన రాజకీయ ప్రవేశం నుంచి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల వరకు.. ఢిల్లీ నుంచి గల్లీ రాజకీయాలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు.. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఇలా అన్నీ అంశాలను కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్‌ ప్రసంగం వినేందుకు తెలుగు ప్రజలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. మరి రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వేళ కేసీఆర్‌ ప్రసంగం ఎలా ఉండబోతోందని చెవులు రిక్కరించి తెలంగాణ ప్రజలతోపాటు ఏపీతోపాటు ఇతర రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News