Telangana Politics: తెలంగాణలో మరోసారి బై పోల్ రానుంది. అది కూడా బీఆర్ఎస్ కండువా మార్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో స్పీకర్ వాళ్లను అనర్హలుగా ప్రకటించాలని బీఆర్ఎస్, బీజేపీలు సవాల్ చేస్తున్నాయి.మరి ప్రతిపక్షాల సవాల్ ను రేవంత్ రెడ్డి ఒప్పుకొని ఉప ఎన్నికలకు వెళతారా అనేది డౌటే. ముందుగా రేవంత్ రెడ్డి ముందు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గండం ఉంది. ఇందులో గట్టెక్కగలిగితే.. వాళ్లను అనర్హలుగా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. లేకపోతే.. ఈ అనర్హత వేటును మరో మూడేళ్లు సాగదీస్తారా అనేది చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగబోతోందా..! ఖైరతాబాద్ బైపోల్‌కు ముందే కేబినెట్ విస్తరణ చేసేందుకు హైకమాండ్ రెడీ అయ్యిందా..! ఈసారి కేబినెట్‌లో బెర్త్ కోసం హైదరాబాద్‌కు చెందిన దానం నాగేందర్ యే లాబీయింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తానంటే.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని హైకమాండ్‌కు భరోసా కూడా ఇచ్చినట్టు సమాచారం.
తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ప్రచారం ఊపందుకుంది. మిగిలిపోయిన మూడు మంత్రి పదవులను విస్తరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మళ్లీ కసరత్తు మొదలుపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంత్రివర్గ విస్తరణపై సీఎంకు దిశానిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది. ఆ మూడు మంత్రి పదవులను వీలైనంతా త్వరగా భర్తీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. అంతకుముందు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలోనూ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు.. అలాగే ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని నేతలను ఖర్గే బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం మాటవినని కొందరు లీడర్లు మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోవడం హాట్‌టాపిక్ అయ్యింది..
ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రికి ప్రాతినిధ్యం లేదు. దాంతో రంగారెడ్డి, లేదా గ్రేటర్ పరిధిలోని ఎవరైనా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఎమ్మెల్యేలు లేకపోవడం ఇక్కడ మైనస్‌గా మారింది. కానీ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీలో కొందరు చేరడంతో.. వాళ్లు ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. ఇస్తే వీరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన హైకమాండ్ చేస్తుండటంతో.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్‌ను పెద్దలను కోరినట్టు సమాచారం.అంతేకాకుండా జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలిపించే బాధ్యతను కూడా తీసుకుంటానని పార్టీ పెద్దల దగ్గర ప్రాతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జూబ్లిహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. గతంలో ఆయన జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ పీజేఆర్ తనయుడు జూబ్లిహిల్స్ కోరుకోవడంతో ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్‌లో ఆయను భారీగా అనుచర గణం ఉంది. అందుకే ఈ ఉపఎన్నికను మంత్రి పదవి కోసం అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ బైపోల్ గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గలేదని నిరూపించుకోవడమే కాదు.. బీఆర్ఎస్ పని అయిపోయిందని తేల్చేలా ఉపఎన్నిక ఫలితాన్ని సాధించాల్సిన బాధ్యత రేవంత్ పై పడింది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఎలాంటి చాయిస్ తీసుకునే చాన్స్ లేదు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా జూబ్లిహిల్స్ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గెలిచి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ను ఆదేశించినట్టు తెలుస్తోంది.
అయితే జూబ్లిహిల్ బాధ్యతను దానం నాగేందర్‌కు అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన తనదైన మార్క్ చూపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆయనకు ముస్లిం వర్గాల్లోనూ మంచి పట్టు ఉంది. జూబ్లీహిల్స్‌లో అభ్యర్ధి గెలుపు, ఓటములను ముస్లిం ఓటర్లే డిసైడ్ చేస్తారు. అందుకే వారిని మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ అభ్యర్ధిని నిలబెడితే.. కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు దాదాపు లేనట్టే అని చెప్పారు. ఎంఐఎం పార్టీ తమ పార్టీ తరపున అభ్యర్ధిని నిలబెట్టకుండా.. అధికార పార్టీ ప్రయత్నిస్తూ.. మద్దతు కూడా కోరుతున్నట్టు సమాచారం. కానీ.. ఎంఐఎం పార్టీ మాత్రం.. నాన్ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తే మాత్రం మద్దతిస్తామని అంటున్నారట. దాంతో అభ్యర్ధి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ డైలామాలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దానం కూడా గెలుపు బాధ్యతలను భూజాన వేసుకుంటానని ప్రకటించడంతో.. అధికార పార్టీ ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
(రచయత..గుర్రం శేఖర్ - తంజావూర్ కిరణ్ కుమార్ శర్మ)
ఇదీ చదవండి: మాజీ ఎంపీ.. ఏకంగా మాజీ ప్రధానితో ఎఫైర్.. నాగ్ సరసన నటించిన స్టార్ హీరోయిన్..
ఇదీ చదవండి: చిన్న చిత్రం అసాధారణ విజయం.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ‘సైయారా’ మూవీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









