Telangana POLYCET Result 2023 Out Check Link: విడుదలైన తెలంగాణ పోలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

Telangana POLYCET Result 2023 Out Check Link: తెలంగాణ పోలిసెట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 5 వేలమంది హాజరైన టీఎస్ పోలీసెట్ 2023 పరీక్ష ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2023, 11:52 AM IST
  • టీఎస్ పోలీసెట్ 2023 పరీక్ష ఫలితాలు విడుదల
  • 82.7 శాతం ఉత్తీర్ణత, 86.63 శాతంతో అమ్మాయిలు పైచేయి
  • టీఎస్ పోలీసెట్ 2023 ఫలితాలకు https://polycet.sbtet.telangana.gov.in/ క్లిక్ చేయండి ఇలా
Telangana POLYCET Result 2023 Out Check Link: విడుదలైన తెలంగాణ పోలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

Telangana POLYCET Result 2023 Out Check Link: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పోలీసెట్ 2023 పరీక్ష ఫలితాలు కాస్సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి శ్రీనాథ్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 92.94 శాతం విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా 82.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

పదవ తరగతి విద్యార్హతతో రాష్ట్రంలోని పోలీటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పోలీసెట్ 2023 పరీక్ష ఈ నెల 17వ తేదీ మద్యాహ్నం 1.30 గంటలకు 296 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 92.94 శాతం మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇందులో బాలురు 58, 520 మంది కాగా, బాలికలు 47,222 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు హాజరైంది మాత్రం బాలురు 54,700 కాగా బాలికలు 43,573 మంది ఉన్నారు. అధికారిక సమాధాన పత్రం ఇప్పటికే టీఎస్ పోలీసెట్ 2023 నిర్వాహకులు విడుదల చేశారు. కీలో అభ్యంతరాలకు గడువిచ్చారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత ఇప్పుడు పరీక్ష ఫలితాల్ని విడుద చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82.7 శాతం ఉత్తీర్ణత సాధించగా, 86.63 శాతంతో అమ్మాయిలు పైచేయి సాధించారు. 

టీఎస్ పోలీసెట్ 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలని అధికారిక వెబ్‌సైట్ https://polycet.sbtet.telangana.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.  పోలీసెట్ ర్యాంకుల ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోలీటెక్నిక్ కళాశాలలల్లో అడ్మిషన్లు జరగనున్నాయి. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది. 

Also read: Teachers Fighting Video: టీచరమ్మలే సిగలు పట్టుకుని కొట్టుకున్నారు.. కిందామీద పడి దంచుకున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News