)
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఇవాళ సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులకు తోడు పిడుగులు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.దీంతో తెలంగాణలో ముఖ్యంగా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఇప్పటికే చేతికి వచ్చిన పంటలు చేతికి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతలకు వచ్చే సమయంలో భారీ వర్షాలు పడటం మూలానా.. ఏర్పడే నష్టాలన్ని పూడ్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అంతేకాదు పలు జిల్లాల్లో కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా కురిసే వర్షపాతం .. అక్కడ ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొని సెలువులు ఇచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ఈ అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజులు పాటు వర్షాలు పడనున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కాకుండా.. ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో మేఘావృతమై ఉన్నా.. పలు ప్రాంతాల్లోనే ఓ మోస్తరు వర్షం కురిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి