)
Telangana Rains: ఈ నెల 13న బంగాళా ఖాతంలో అల్ప పీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మూసీ పొంగిపొర్లుతుంది. అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు నగరం నడిపొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో నిండాయి. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహాక ప్రాంతాల్లో నీళ్లు రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకోవడంతో నీటిని మెల్లగా దిగువకు ఒదులుతున్నారు. దీంతో గాంధీ నగర్, ఇందిరా పార్క్, చిక్కడ పల్ల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్త చేశారు. అల్ప పీడన ప్రభావంతో తెలంగాణకు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
తెలంగాణలో 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్.. భూపాలపల్లి, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబా బాద్ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చెరువులు, కుంటలు , వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల కట్టలు తెగడంతో పలు ప్రాంతాలకు రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇక మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ముఖ్యంగా కార్వాన్, జియా గూడ, పురానపూల్, నయాపూల్, చాదర ఘాట్, ముసారాం బాగ్ దగ్గర మూసీ ఉదృతం కారణంగా అక్కడన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక మొత్తంగా ఈ రోజు, రేపు కురిసే వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకు వెళ్లదీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.