Telanangana Districts: తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం జిల్లాలపై సమీక్షకు దిగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరహాలో జిల్లాల పునర్విభజన చేయనున్నారని సమాచారం. రానున్న పంచాయితీ ఎన్నికల తరువాత ఈ విషయంపై సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 10 జిల్లాలను ఏకంగా 33 జిల్లాలుగా చేసింది. జిల్లాల విభజన పూర్తి అశాస్త్రీయంగా జరిగిందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఒక్కో జిల్లా 5 ముక్కలుగా కూడా విడిపోయింది. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడో జిల్లా తరహాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ పోయిందనే విమర్శ ఉంది. దాంతో పాలనాపరంగా చాలా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఒక్కో ఎంపీ నియోజకవర్గ పరిధిని 3-4 జిల్లాలు చేయడంతో నిధుల ఖర్చు విషయంలో సమస్యగా మారింది. స్థానిక పరిపాలనలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఎన్నికల సందర్భంగా కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 


ఇప్పుడు త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికల అనంతరం జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించనుంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం ముందుగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ తరువాత పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించింది. పూర్తి శాస్త్రీయంగా జరగడంతో ఎక్కడా ఎలాంటి విమర్శలు తలెత్తలేదు. ఇప్పుడిదే తరహాలో తెలంగాణలో జిల్లాల ఏర్పాటుకు నడుం బిగిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్ని 17 జిల్లాలుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న 33 జిల్లాల్లో 16 జిల్లాల్ని తొలగించాల్సిన పరిస్థితి.


33 జిల్లాల్ని 17 జిల్లాలకు కుదిస్తే శాస్త్రీయంగా ఉండవచ్చు గానీ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఉన్నతాధికారులతో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు.


Also read: Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook