Telangana RTC: ఇది తాత్కాలికమే..!.. ఆర్టీసీ సమ్మె వాయిదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ సంఘాల నేతలు..

Telangana rtc Employees:  తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో ఆర్టీసీ సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో సమ్మెను తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 6, 2025, 04:23 PM IST
  • తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా..
  • పలు డిమాండ్ లకు ఓకె చెప్పిన సర్కారు..
Telangana RTC: ఇది తాత్కాలికమే..!.. ఆర్టీసీ సమ్మె వాయిదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ సంఘాల నేతలు..

Telangana rtc employees postponed: తెలంగాణలో ఆర్టీసీ సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వంకు డెడ్ లైన్ విధించాయి. ఈ క్రమంలో సమ్మెకు వెళ్తామని నోటీసులు కూడా ఇచ్చాయి.ఈ క్రమంలో ఇటీవల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభావర్ ఆర్టీసీ సంఘాల నేతలకు పలు సూచనలు చేశారు.. అంతే కాకుండా.. ప్రస్తుతం తెలంగాణ చాలా ఇబ్బందుల్లో ఉందని, కొలుకుంటున్న రాష్ట్రంను ఇంకా నష్టాల్లో నెట్టవద్దని అన్నారు.

Add Zee News as a Preferred Source

అయితే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సంఘాల నేతలతో చర్చించడానికి.. ముగ్గురు ఐఏఎస్ లైన నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో సదరు అధికారులు.. ఆర్టీసీ సంఘాల నాయకులతో మాట్లాడారు. ఆర్టీసీ సంఘాల నేతల డిమాండ్ లకు ప్రభుత్వం తరపు ఏర్పాటు చేసిన అధికారులు సానుకూలంగా స్పందించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

ఈ క్రమంలో ఆర్టీసీ సంఘాల నేతలు.. తమ సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్టీసీలో కూడా సింగరేణి ఉద్యోగుల మాదిరిగా.. కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణపై కూడా ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించింది. అంతేకాకుండా.. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సుల్ని కొని ఆర్టీసీకి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకొవాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి కూడా తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

Read more: Hyderabad Fish Prasadam: హైదరాబాద్‌లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి డేట్స్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?  

దీంతో ఆర్టీసీ ఇప్పటికే ఇచ్చిన సమ్మె అల్టిమెటంను తాత్కలింకంగా వాయిదా వేసుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. ఒక వేళ ప్రభుత్వం మాట ఇచ్చితప్పితే మాత్రం మరల సమ్మెకు దిగుతామని ఆర్టీసీ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News