Telangana RTC: తెలంగాణ ఆర్జీసీ బస్సుల్లో అందరని కాదు కానీ.. కొంత మంది కండక్టర్స్ చిల్లరకొట్టుడు వ్యవహారం మొత్తం వ్యవస్థకే మచ్చ తీసుకొస్తోంది. ఎవరైనా బస్సు ఎక్కి పెద్ద నోటు ఇస్తే.. చిల్లర ఉన్నా లేదూ అన్నట్టు అత్యవసర ప్రయాణం చేసేవారినీ నిర్ధాక్షణ్యంగా బస్సులోంచి కిందికి దింపేసే ఘటనలు కోకొల్లలు. కొంత మంది కండక్టర్స్ చిల్లర వ్యవహారం వల్ల ఆర్టీసీ అభాసుపాలవుతోంది. కొంత మంది కండక్టర్స్ చిల్లర లేకపోతే.. టికెట్ వెనకాల తర్వాత ఇస్తామంటూ రాసి ఇస్తుంటారు. కొంత మంది కండక్టర్స్ ప్రమేయం లేకుండా.. తమ దిగాల్సిన స్టాప్ రావడంతో హడావుడిగా దిగేస్తుంటారు. దీంతో చిల్లర తీసుకోవడం మరిచిపోతుంటారు. కొంత మంది ప్రయాణికులు ఆయా బస్సు డిపోల దగ్గర వెళ్లి మిగిలిన చిల్లర తీసుకున్న సందర్భాలున్నాయి. ఒక్కో సారి ప్రయాణికులు.. మరోసారి కండక్టర్స్ వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లెమ్ అవుతోంది. ఒక్కోసారి కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర ఉండవు. ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రాబ్లెమ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ విరుగుడుగా సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చునని తాజా ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చామంటున్నారు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయనీ అధికారులు తెలిపారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చని తెలిపింది. అలా అని అకౌంట్లో డబ్బులు ఉండాల్సిందే. దీంతో చిల్లర లేదని ప్రయాణం మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









