RTC Jobs 2025: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య 1,743. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు, అర్హతలు ఇవే..
ఇందులో వెయ్యి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆయా పోస్టులను బట్టి ఐటీఐ, టెన్త్ పాస్ అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగుండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి..
1. 2025 జూలై 1కి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
2. శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు.
3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఈఎస్‌ఎం అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు.
వేతనం వివరాలు..
డ్రైవర్ పోస్టుకు నెలకు.. రూ.20,960 – రూ.60,080
శ్రామిక్ పోస్టుకు నెలకు రూ.16,550 – రూ.45,030.
అప్లికేషన్ ఫీజు..
* డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 300, ఇతరులకు రూ. 600.
* శ్రామిక్ పోస్టులకు రూ. 200, ఇతరులకు రూ.400.
* అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం..
* ఫిజికల్ మెజర్‌మెంట్ (పీఎంటీ)
* మెడికల్
* డ్రైవింగ్ టెస్ట్.
Also Read: Rain Alert: వామ్మో.. మళ్లీ దంచికొట్టనున్న వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









