Maha Shivaratri Spl Buses: మహా శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులు..

Maha Shivaratri Spl Buses: మహా శివరాత్రి  సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు లు నడపనుంది. 43 శైవ క్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 24వ తేదీ నుంచి 28 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 23, 2025, 03:56 PM IST
Maha Shivaratri Spl Buses: మహా శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులు..

Maha Shivaratri Spl Buses: మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపబోతుంది.  ప్రధానంగా శ్రీశైలం మహా క్షేత్రంతో పాటు వేములవాడ,  కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం , ఏడుపాయల జాతర, కొమురవెల్లి కి ప్రత్యేక  బస్సులు నడుపుతోంది. వీటితో పాటు భక్తులు దర్శించుకునే  అలంపూర్, ఉమా మహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.  

Add Zee News as a Preferred Source

ఈ స్పెషల్‌ బస్సులు హైదరాబాద్‌లోని మహాత్మ గాంధీ బస్ స్టాండ్, జూబ్లీ బస్ స్టేషన్, సీబీఎస్, ఐఎస్‌ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి  ప్రారంభం కానున్నాయి.  అయితే  ఈ స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం  అదనపు చార్జీలను వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెగ్యులర్‌ సర్విస్‌ల టికెట్‌ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

గత ఏడాది శివరాత్రికన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌. రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచుతామన్నారు. మహా శివరాత్రి స్పెషల్‌ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News