Telangana rtc unions call for complete strike from may 6th: తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ కు ఒకదాని వెంట మరోకటి వరుసగా షాక్ లు తగులుతున్నాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికే హైదరబాద్ సెంట్రల్ యూనివర్సీటీ ఘటనలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలువేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. రాజకీయ నేతలతో పాటు, సెలబ్రీటీలు, పర్యావరణ ప్రేమికులు కూడా రేవంత్ సర్కారు తీరును తప్పుపడుతున్నారు.
ఇది చాలదన్నట్లు ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై చర్యల విషయంలో కూడా అత్యున్నత ధర్మాసనం కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇది చాలదన్నట్లు అపోసిషన్ పార్టీలు రేవంత్ సర్కారును ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఎక్కడ గ్యాప్ దొరికిన, ఏ అంశం దొరికిన కూడా రేవంత్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ సర్కారుకు మరో బ్యాడ్ న్యూస్ అనిచెప్పుకొవచ్చు. వచ్చే నెల మే 6 నుంచి తాము సమ్మేలోకి వెళ్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మేనోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తెలంగాణ లేబర్ డిపార్ట్ మెంట్ కు సమ్మేకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ విషయంలో ఇచ్చిన హమీలన్ని నెరవేర్చాలని కూడా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నెల ప్రారంభమైన ఇన్ని రోజులు గడుస్తున్న తమకు ఇంత వరకు కూడా నెల జీతాలు పడలేదని ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చినాక ఒకలా రేవంత్ సర్కారు తీరు మారిందని కూడా కార్మిక సంఘాలు మండిపడుతున్నారు. మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తామని కూడా కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వానికి సమ్మే నోటీసులు ఇవ్వడం మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









