Ration Cards: రేషన్ కార్డ్ హోల్డర్స్ కు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. ఇకపై ఆ 9 సరుకులు..

Ration Cards: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్న సర్కార్... అభయహస్తం రేషన్ కిట్" పేరుతో ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2025, 09:19 AM IST
Ration Cards: రేషన్ కార్డ్ హోల్డర్స్ కు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. ఇకపై ఆ 9 సరుకులు..

Telangana Ration Cards:  ప్రస్తుతం రేషన్ కార్డ్ ఉన్న వారందరు అర్హులు కాదనే విషయం ప్రభుత్వానికి తెలియందు కాదు. చాలా మంది ఈ రేషన్ కార్డ్ వల్ల ప్రభుత్వ ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ తో పాటు, ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్  వంటి పథకాల కోసమే ప్రజలు రేషన్ కార్డ్ ఒదులుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా ఈ బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తే.. తమ ఓటు బ్యాంక్ కు ఎక్కడ బొక్క పడుతుందో అని ఈ తతంగాన్ని నడిపిస్తూనే ఉంది. గతంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు.. పింక్ రేషన్ కార్డ్ ఉండేది.

Add Zee News as a Preferred Source

ఇపుడు అదే తరహాలో ఎగువ మధ్య తరగతి వాళ్ల కోసం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయనే లేదు. ఈ సంగతి పక్కన పెడితే.. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది.

ఇప్పటికే రేషన్ కార్డు పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే  ఉచిత బియ్యంతో పాటు పలు వస్తువును అమ్ముతున్నారు. తాజాగా ఇపుడు రేషన్ కార్డ్ హోల్డర్స్ కు  ఒక్కో కిట్‌లో 9 నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రేషన్‌లో సన్నబియ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం...నిత్యావసర సరుకుల కిట్ కూడా ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే  ఈ కిట్‌లో తమకు ఏమేం కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు. లేదా అన్నీ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకనేవారు, ఉప్పు కాకుండా మిగతావి తీసుకోవచ్చు. అలాంటి వెసులుబాటు ఉంటుందని తెలిసింది. వీటిని ప్రతి నెలా ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది సర్కార్.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News