
Telangana Sarpanch Election Notification: తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌కు స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ డా.జి.సృజన అందజేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించిన జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు నివేదికను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్థానిక సంస్థల నిర్వహణకు ముందుకెళ్లాలంటూ ఎస్ఈసీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీకి ప్రభుత్వం నుంచి బీసీ రిజర్వేషన్ల ఖరారు జీఓ, పంచాయతీరాజ్ శాఖ నుంచి స్థానిక సంస్థల్లో ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు జాబితా, రాబోయే 15 నుంచి 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఆదేశాలు అందినట్టుగా అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తే, వెంటనే మూడురోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు సమాచారం. మొదట రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత వారం, పదిరోజుల్లోనే మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
నేడు ఎస్ఈసీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పీఆర్ కమిషనరేట్ కార్యాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించి మూడేసీ చొప్పున రిజర్వేషన్ల ఖరారు సైన్డ్ కాపీలు చేరాయి. వీటిని ఎన్నికల కమిషనర్‌కు పీఆర్ డైరెక్టర్ చేరవేశారు. జిల్లా పరిషత్‌ల స్థాయిలో జెడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సీఈఓ, మండల, గ్రామ పంచాయతీల పరిధిలోని స్థానాల రిజర్వేషన్లను జిల్లా పంచాయతీ అధికారులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు.
పీఆర్ డైరెక్టర్ సమర్పించిన రిజర్వేషన్ల జాబితాలపై అర్ధరాత్రి వరకు ఎస్ఈసీ అధికారులు, సిబ్బంది జిల్లాల వారీగా అందిన రిజర్వేషన్ల సమాచారాన్ని క్రోడీకరించినట్టు తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగా మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల స్థానాలు, ఎన్ని దశల్లో నిర్వహణ, తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎస్ఈసీ అధికారులు నోట్ ఫైల్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫైల్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతకం కాగానే వెంటనే నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి స్కాన్డ్ కాపీలను ఎస్ఈసీ కోరడంతో...అర్ధరాత్రి దాకా ఈ పనిలో పీఆర్ అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం. నోటిఫికేషన్ జారీకి ముందే ఎస్ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. దీనిపై స్పష్టత కొరవడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.