Sarpanch elections tragedy in kumuram bheem district: తెలంగాణ లో ప్రస్తుతం రెండు విడదల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అన్ని ప్రధాన పార్టీలు సైతం లోకల్ బాడీ పొల్స్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు పలు చోట్ల ఓటమిని చవిచూశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ లు కొంచెం జోష్ తో ఉన్నాయి. అయితే.. రెండు దశల్లో కూడా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పలు చోట్ల తమపై బరిలో నిలబడ్డ వారిపై దాడులు చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
గెలిచిన సర్పంచ్ అభ్యర్థి మీద కొడవలితో దాడి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి మీద వేట కొడవలితో దాడికి యత్నించిన ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి
సిర్పూర్(టి) మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక గెలిచిన అభ్యర్థి తనుబాయి భర్త… pic.twitter.com/w1yaTJbnUm
— Telugu Scribe (@TeluguScribe) December 15, 2025
తాజాగా.. కుమురం భీ అసిఫాబాద్లో గెలిచిన బీజేసీ సర్పంచ్ ను చెట్టుకు కట్టేసి కాంగ్రెస్ అభ్యర్తి కొడవలితో దాడికి యత్నించాడు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి మీద, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి దాడికి యత్నించాడు.
ఈ ఘటన సిర్పూర్(టి) మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక గెలిచిన అభ్యర్థి తనుబాయి భర్త పోశెట్టిపై వేట కొడవలితో దాడికి యత్నించిన భీంరావు అనే అభ్యర్థి దాడికి ప్రయత్నించాడు.
Read more: Brs Ktr: ప్రతి జిల్లాలో లీగల్ సెల్.. సర్పంచ్ ల దాడుల ఘటనలపై కేటీఆర్ సంచలన ప్రకటన..
సర్పంచ్ ను చెట్టుకు కట్టేసి అతనిపై కోడవలితో దాడికి యత్నించాడు. దీంతో గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై పోలీసులు భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









