Summer Holidays: తెలంగాణలో స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్, కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. సమ్మర్ వెకేషన్ వెళ్లే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకో చూద్దాం.
తెలంగాణలో ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి, డిగ్రీ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23తో స్కూల్ విద్యార్ధుల పరీక్షలు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. రాష్ట్రంలోని స్కూల్స్, జూనియర్ కళాశాలలకు ఈ ఏడాది వేసవి సెలవు షెడ్యూల్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణలో ఈ విద్య సంవత్సరంలో సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. తిరిగి జూన్ 12వ తేదీన స్కూల్స్ తెర్చుకుంటాయి. మొత్తం 46 రోజులు వేసవి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.
అటు జూనియర్ కళాశాలలకు ఇప్పటికే వేసవి సెలవులు ఇచ్చేశారు. మార్చ్ 31 నుంచి జూన్ 1 వరకూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. జూన్ 2వ తేదీన తెలంగాణలో జూనియర్ కళాశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. సమ్మర్ వెకేషన్ గడిపేందుకు ఇదే మంచి అవకాశం. ఏదైనా హిల్ స్టేషన్ లేదా చల్లని ప్రాంతాన్ని సందర్శించి రావచ్చు.
Also read: AP SSC Results 2025: పదో తరగతి SSC ఫలితాలు ఏప్రిల్ 22న, ఆన్‌లైన్, వాట్సప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









