
Telangana Flag Host: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. అటు మండలి కార్యాలయం ముందు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ జెండాను ఎగురవేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడింది.
ఎంతో మంది ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా అప్పటి ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. మన దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ తర్వాత మనదేశంలో కొత్తగా మరే రాష్ట్రం ఏర్పడలేదు. కానీ 370 ముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్.. జమ్మూ కశ్మీర్, లడ్డాఖ్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయి. అటు దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ ప్రాంతాలు ఒకటిగా చేసి డామన్ డయ్యూ అయ్యాయి. మొత్తంగా మన దేశంలో 28 రాష్ట్రాలు.. 8 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నపుడు తెలంగాణకు మొదటి ఎన్నికలు జరిగాయి. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.