Telangana SSC Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు , ఎలా చెక్ చేసుకోవాలి

Telangana SSC Results 2025: ప్రస్తుతం అంతా పరీక్ష ఫలితాల కోసం చూస్తున్నారు. ఏపిలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా ఇక పదో తరగతి ఫలితాల కోసం నిరీక్షణ నెలకొంది. అటు తెలంగాణలో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల కావల్సి ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2025, 04:10 PM IST
Telangana SSC Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు , ఎలా చెక్ చేసుకోవాలి

Telangana SSC Results 2025: తెలంగాణ ఎస్ఎస్ సి ఫలితాల కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ దాదాపుగా ఖరారైంది. అధికారికంగా పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి, ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలు మీ కోసం. 

Add Zee News as a Preferred Source

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. త్వరలో అంటే ఏప్రిల్ 22-25 మధ్యలో పదో తరగతి ఫలితాలు వెల్లడవుతాయి. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కావల్సి ఉన్నాయి. ఈ రెండింటి వాల్యుయేషన్ ప్రక్రియ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 7న మొదలైన పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15 వరకు జరుగుతుంది. ఆ తరువాత రీ చెకింగ్, మార్కుల కంప్యూటరీకరణ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో 10 రోజులు పట్టవచ్చు. ఆ తరువాత ఏప్రిల్ 28-30 తేదీల్లో తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి.

పదో తరగతి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకునేందుకు రెండు వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి అందులో ఒకటి తెలంగాణ పదో తరగతి బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in కాగా రెండవది మనబడి వెబ్ సైట్ https://www.manabadi.co.in

మీ ఫలితాలు చెక్ చేసుకునేందుకు పుట్టిన తేదీ, హాల్ టికెట్ వివరాలు ఉంటే సరిపోతుంది. మార్కుల మెమోను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు. 

Also read: Jio Best Recharge Plan: కేవలం 601 రూపాయలకే ఏడాది రీఛార్జ్ ప్లాన్, ఎలాగంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Trending News