Telangana 10th Results 2025: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు కాస్త ఆలస్యమయ్యాయి. గతంలో లాగ గ్రేడింగ్ విధానంలో కాక.. మార్కులతో 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. అందుకే తెలంగాణలో పరీక్ష ఫలితాల విడుదల లేట్ అయింది. ఈ రోజు రవీంద్రభారతీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను విడుల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం.. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.
తెలంగాణలో ఈ ననె 7 నుంచి పరీక్ష పత్రాలను ఆచార్యులు మూల్యాంకనం స్టార్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15న అది ముగియాల్సి ఉంది. ఒక రోజు లేట్ గా ఏప్రిల్ 16న పూర్తయింది. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ, ఇతర ప్రక్రియకు వారం నుంచి 10 రోజుల సమయం తీసుకున్నారు. మొత్తంగా ఈ రోజు (ఏప్రిల్ 30)న పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణ సర్కారు ఎగ్జామ్ షీట్స్ మూల్యాంకన విధానంలో చేసిన మార్పు కారణంగా ఫలితాలు లేట్ గా విడుదల అవుతున్నాయి.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
తెలంగాణలో గత యేడాది విద్య సంవత్సరం వరకు గ్రేడింగ్ సిస్టమ్ ఉండేది. మార్కులు ప్రకటించకుండా గ్రేడింగ్ ఇచ్చే విధానం ఇన్ని రోజులు కొనసాగింది. ఈసారి గ్రేడింగ్ విధానం తీసేసి ఒకప్పటిలా మార్కుల విధానం ప్రవేశ పెట్టింది. 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అమల్లోకి వస్తోంది. నెక్ట్స్ ఇయర్ నుంచి మాత్రం 100 శాతం ఎక్స్‌టెర్నల్ విధానమే ఉండనుంది.
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా మీరు మీ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు. ముందు సైట్ ఓపెన్ చేశాక అక్కడ కనిపంచే తెలంగాణ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2025 లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు, మార్కుల మెమో స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









