TG SSC Results 2025: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు కాస్త ఆలస్యం, ఎప్పుడు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలి

TG SSC Results 2025: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలపై బిగ్ అప్‌డేట్ వెలువడింది. పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2025, 12:19 PM IST
TG SSC Results 2025: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు కాస్త ఆలస్యం, ఎప్పుడు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలి

TG SSC Results 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం విద్యార్లులంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఫలితాల విడుదల కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యేది స్పష్టత వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 7 నుంచి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15న వాల్యుయేషన్ ముగియాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా ఏప్రిల్ 16న పూర్తయింది. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ, ఇతర ప్రక్రియకు 7-10 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన ఏప్రిల్ 23-24 తేదీల్లో తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవ్వాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం పరీక్ష పత్రాల మూల్యాంకన విధానంలో చేసిన మార్పు కారణంగా ఫలితాలు ఆలస్యం కానున్నాయి. 

తెలంగాణలో ప్రస్తుతం గ్రేడింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. అంటే మార్కులు ప్రకటించకుండా గ్రేడింగ్ ఇస్తారు. చాలా ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. అయితే ఈసారి గ్రేడింగ్ విధానం తొలగించి తిరిగి మార్కుల విధానం ప్రవేశపెడుతోంది. 2024-25 విద్య సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తోంది. మరోవైపు ఈ ఏడాదికి 80 శాతం ఎక్స్‌టర్నల్ పరీక్షలు, 20 శాతం ఇంటర్నల్ పరీక్షలు ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి మాత్రం 100 శాతం ఎక్స్‌టెర్నల్ విధానమే ఉండనుంది. అందుకే ఈసారి తెలంగాణ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు ఆలస్యంగా ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి 

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందు సైట్ ఓపెన్ చేశాక అక్కడ కన్పించే తెలంగాణ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2025 లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు, మార్కుల మెమో స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. 

Also read: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు, ర్యాంకుల విడుదల, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News