
Telangana SSC Exams 2025: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి 21 నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2650 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం వరకు ఎగ్జామ్ ఉంటుంది. అయితే, ఈసారి ఐదు నిమిషాలు ఆలస్యం అయినా పరీక్షకు అనుమతి ఇవ్వనున్నారు. ఇది కాకుండా ఈసారి అడిషన్ పేజీలు ఇవ్వమని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు.
ఈరోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి గ్రేస్ పీరియడ్ ప్రకటించడంతో విద్యార్థులకు గుడ్‌న్యూస్. కానీ, అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అవరమయ్యే ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం సందర్భంగా మంచినీటి సౌకర్యం కల్పించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహిస్తారు.
చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈసారి విద్యార్థులు, తల్లిదండ్రుల రిక్వెస్ట్‌తో గ్రేస్ పీరియడ్ ప్రకటించారు. అయితే, సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా సున్నిత ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. పదవ తరగతి పరీక్ష సమయంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఈసారి ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టారు. ఇది కూడా విద్యార్థులకు భారీ ఊరట ఇచ్చే అంశం.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఈసారి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది కాదు. కానీ, ఈసారి 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ప్రకటించనుంది. ఇది కాకుండా ఈసారి అడిషనల్స్ కూడా ఇవ్వదు. బుక్లెట్ విధానాన్ని ప్రకటించింది. ఇక ఏప్రిల్ 4వ తేదీ ఈ పరీక్షలు ముగుస్తాయి. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యంకనం చేయననున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
ఇక ఎగ్జామ్ సెంటర్లలో 28 వేల మందికి పైగా ఇన్విజిలేటర్లను పెట్టరు. అయితే, విద్యార్థులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకుని అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలి. అయితే, బ్లూటూత్, ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగ్జామ్ సెంటర్లోపలికి తసుకెళ్లకూడదు. వీటిని అనుమతించారు. ఇక ఎగ్జామ్ సెంటర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను కూడా అనుమతించడం లేదు. జిరాక్స్ సెంటర్లను కూడా మూసి ఉంచనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe