TG SSC Exams 2025: మార్చ్ 21 నుంచి పదో తరగతి పరీక్షలు, హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TG SSC Exams 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధమైంది. మార్చ్ 21 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు bse.telangana.gov.in నుంచి పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2025, 05:23 PM IST
TG SSC Exams 2025: మార్చ్ 21 నుంచి పదో తరగతి పరీక్షలు, హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TG SSC Exams 2025: తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాగానే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. 

Add Zee News as a Preferred Source

తెలంగాణలో పదో తరగతి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు ప్రస్తుతం bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి విద్యార్ధులు తమ హాల్ టికెట్లను స్కూల్స్ నుంచి పొందవచ్చు. ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోతే సదరు విద్యార్ధులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు ఏదైనా సమస్య ఎదురైనా లేదా కావల్సిన సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 040-23230942ని సంప్రదించవచ్చు. 

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చ్ 7న విడుదలయ్యాయి. స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ నుంచి లేదా bse.telangana.gov.in ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

Also read: Aadhaar Card: ఆధార్ కార్డు బిగ్ అప్‌డేట్, ఇలా చేయకపోతే ఆధార్ రద్దయిపోతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News