Telangana: విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల, ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులు..

 Telangana SSC Results 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 29, 2025, 05:22 PM IST
Telangana: విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల, ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులు..

Telangana SSC Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులతోపాటు గ్రేడింగ్‌ కూడా ఇవ్వనున్నారు. . సెకండరీ బోర్డు ఎడ్యుకేషన్ ఆఫ్‌ తెలంగాణ పదో తరగతి పరీక్షలను మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించింది. ఇందులో ప్రధానంగా మ్యాత్స్‌, సైన్స్‌తోపాటు ఇతర సబ్జెక్టులు కూడా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే తెలంగాణ పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం కూడా పూర్తయింది. ఇక ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకు బుధవారం రోజు ఈ పరీక్ష ఫలితాలు అంటే రేపు విడుదల కానున్నాయి. bse.telangana.gov.in తెలంగాణ అధికార వెబ్‌సైట్లో ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.

ప్రధానంగా ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులతోపాటు గ్రేడిండ్‌ కూడా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే మెమో కూడా జారీ చేయనున్నారు. ఇటీవల కీలక సమీక్ష విద్యాశాఖ జరిపిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లను తమ వద్ద రెడీగా ఉంచుకోవాలి. అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు ఆ విధానం తెలుసుకుందాం.

తెలంగాణ SSC ఫలితాలు 2025 ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయాలి.  మీరు 'టిఎస్ SSC ఎగ్జామ్ రిజల్ట్స్ 2025' హోమ్ పేజీలో క్లిక్ చేయాలి. అక్కడ హాల్ టికెట్ నెంబర్,  పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరిగా దాన్ని సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఫలితాలను మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు.

తెలంగాణ SSC ఫలితాలు 2025 ఎస్ఎంఎస్ విధానం..
తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు SSC మెసేజ్ ద్వారా తెలుసుకోవాలంటే దీనికి మీరు మీ హాల్ టికెట్ నెంబర్‌ను 56263 కి మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మీ ఫలితాలు మొబైల్ లో ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.

READ ALSO: మారిన తత్కాల్ టికెట్ నియమాలు.. . భారతీయ రైల్వేలు ముఖ్యమైన ప్రకటన..  

ఇక ప్రొవిషనల్ మార్క్ షీట్స్ లో విద్యార్థి పేరు, క్రమ సంఖ్య ,జిల్లా పేరు కలిగి ఉంటుంది. ఇక సబ్జెక్టు వారీగా గ్రేడ్స్‌ (A1 నుంచి F) వరకు అందుబాటులో ఉంటాయి. ఇంకా స్టేటస్ కూడా పాస్ లేదా ఫెయిల్ అని కనిపిస్తుంది. విద్యార్థులు ఇవన్నీ సరిగ్గా పరిశీలించాలి. ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే Bse తెలంగాణ బోర్డు కు నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. ఇదిలా ఉండగా 2024లో 90 శాతానికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్ష పాసయ్యారు.

READ ALSO: తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవులు ప్రకటించేసిన ప్రభుత్వం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News