Telangana Rythu Bharosa: ఎకరాకు రైతు బంధు పైసలు..

Telangana Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులను అధికారులు జమ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 6, 2025, 08:52 AM IST
Telangana Rythu Bharosa: ఎకరాకు రైతు బంధు పైసలు..

Telangana Rythu Bharosa: 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసినట్లు తెలిపారు వ్యవసాయశాఖ మత్రి తుమ్మల తెలిపారు.  ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 1,126.54 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతుబంధుకు రూ. 7వేల 625 కోట్లు, రుణమాఫీకి రూ. 20వేల 616.89 కోట్లు, రైతు భీమాకు రూ. 3వేల కోట్లు కేటాయించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక ఎకరం ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు పూర్తి కావడంతో..మరో రెండు రోజుల్లో రెండు, మూడు ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

Add Zee News as a Preferred Source

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

తెలంగాణ అధికారంలో వచ్చిన యేడాది తర్వాత రైతులకు అకౌంట్లో డబ్బు జమ చేసింది రేవంత్ సర్కారు. ముందుగా ఒక ఎకరం ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన రేవంత్ సర్కార్.. రెండో విడతలో 2 ఎకరాల పొలం ఉన్న రైతులకు అకౌంట్లలో పైసలు జమ చేయనున్నారు. ఆపై మూడు ఎకరాలు .. నాలుగు ఎకరాలతో పాటు విడతల వారీగా పైసలు జమ చేయనున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News