)
Telangana State Mahila Commission: గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కు చెందిన అగ్ర నృత్య దర్శకుడు.. తన సినిమాల్లోని పాటల్లో హీరోయిన్స్ తో అసభ్యకరమైన నృత్య రీతులను కంపోజ్ చేస్తున్నాడు. హీరోయిన్ పిరుదులపై హీరో దబ్బిడి దిబ్బిడి అని బాదేయడం.. ఫీలింగ్స్ అంటూ హీరో, హీరోయిన్స్ మధ్య శృతి మించిన శృంగార నృత్య రీతులు.. మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ బ్యాక్ హీరోతో చేతులు పెట్టించి వేసిన స్టెప్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి... తాజాగా రాబోతున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో హీరోయిన్ కేతిక శర్మ తో లంగా స్టెప్ ఈ అసభ్యకర నృత్యాలకు పరాకాష్ఠ అని చెప్పాలి.
ఇలా సినిమా పాటల్లో హీరోయిన్స్ ను పై చిత్రీకరిస్తోన్న డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగాను.. మహిళల ఔనత్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయా సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్స్ తో పాటు ఆ పాటలను ఓకే చేసిన హీరోలను ఏకి పారిస్తున్నారు.
సినిమాల్లో హీరోయిన్స్ పై జరుగుతున్న జుగుప్సాకరమైన ఈ నృత్య రీతులపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే పవర్ ఫుల్ మీడియా కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, 24 క్రాఫ్ట్స్ కు సంబంధిత వర్గాలు ఎంతో బాధ్యతా యుతంగా మెలగాల్సిన వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం సినిమా నిర్మాత, దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరోలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల్లో నానుతున్న ఈ అసభ్యకర నృత్య రీతులను సమకూర్చింది శేఖర్ మాస్టర్ కావడం గమనార్హం.
సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించేలా ఉన్నారు. అదే విధంగా మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది అందరి నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని.. సినిమా పరిశ్రమ పెద్దలే స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు నేరుగా తెలియజేయవచ్చు. ఈ విషయం పై నిశితంగా పరిశీలన చేసి చట్టాలకు అనుగుణంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe