'ఈఒడిబీ' లో తెలంగాణ ఫస్ట్

Last Updated : Nov 1, 2017, 10:27 AM IST
'ఈఒడిబీ' లో తెలంగాణ ఫస్ట్

తెలంగాణ 'ఈఒడిబీ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)' ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)' ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. తాజాగా 2017 సంవత్సరానికి గాను ఈఒడిబీ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. హర్యానా రెండవ స్థానంలో, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 15 వ ర్యాంక్ దక్కింది.   

ఈ ఏడాది సెంట్రల్‌ ఇన్‌స్పెక్షన్‌ సిస్టమ్, ఆన్‌లైన్‌ ద్వారా భూముల కేటాయింపులు, సింగిల్‌ విండో పాలసీ, నిర్మాణ అనుమతులు, రాష్ట్రాల మధ్య వలస కూలీల ఒప్పందాలు వంటి అంశాలకు చెందిన దాదాపు 105 సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించినట్లున్నారు. 2017కు గాను ఇప్పటివరకు రాష్ట్రాలు అందజేసిన సమాచారం ప్రకారం.. తెలంగాణ 60.22 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. నవంబర్‌ 7 నాటికి వివిధ రాష్ట్రాల నుంచి అండ్ సమాచారం అనంతరం ‘ఈఒడిబీ’ తుది ర్యాంకులను వెల్లడిస్తుంది. 

Trending News