Telangana Traffic Police: పోలీసు, రవాణా శాఖల మధ్య సాంకేతిక సమన్వయం మెరుగు పరచనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో పది రెట్లు ఎక్కువమంది చనిపోతున్నారని పోలీసుశాఖ చెబుతోంది.ఎట్టి పరిస్థితుల్లోనేనా వాటిని అడ్డుకుంటామంటోంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రెడీ చేశారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘనే అంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల జరుగుతున్న నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉల్లంఘనులపై ఎప్పటికప్పుడు చలానాల రూపంలో జరిమానా విధిస్తున్నారు. కానీ చాలామంది ఈ జరిమానాలు కట్టడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు, చలానాలు అంటే వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు క్రమం తప్పకుండా వాహనాలు తనిఖీ చేస్తున్నా చలానాలు పెండింగ్‌లో ఉన్నవారు కూడా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. కొందరయితే జరిమానా కట్టడానికి సిద్ధపడే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ముందు వాహనదారులు నిబంధనలు పక్కాగా పాటించేలా చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వీరి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘనలపై పలు రకాలుగా పోలీసులు పాయింట్లు కేటాయిస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఎవరికైనా 12 పాయింట్లు వస్తే వారి లైసెన్సు ఏడాదిపాటు రద్దు చేస్తారు. వాస్తవానికి ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. ఇలాంటి ఉల్లంఘనల వివరాలను పోలీసులు రవాణాశాఖకు పంపుతారు. ఎవరికైనా 12, ఆపైన పాయింట్లు నమోదైతే లైసెన్సులను రవాణాశాఖ ఆటోమేటిక్‌గా రద్దుచేయాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమాచార మార్పిడి అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఏడాదికి హైదరాబాద్ పరిధిలో కోటికిపైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతుండగా.. 2024 జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు రవాణాశాఖ 18,973 డ్రైవింగ్ లైసెన్సులు మాత్రమే రద్దుచేసింది.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









