Telangana Rains: తెలంగాణ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబ్ నగర్ , వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూ్ల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
ఇప్పటికే తెలంగాణలో నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే గత గురువారం కురిసిన భారీ వర్షాలకు తెలంగాణతో పాటు హైదరాబాద్ మహా నగరంలో కురిసిన భారీ వర్షాలకు మొత్తం అతలాకుతలమైంది. మొన్న పడ్డ వర్షాలకు తోడు భారీ ఈదురు గాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి. అవసరమైన చోట విద్యుత తీగలను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలిగించే పనిలో పడ్డారు.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









