)
Telangana Weather updates: తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వర్షాలు విజృంభిస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అంతేకాదు వర్షాలతో చాలా చోట్ల భూగర్భ జలాలు పెరిగాయి. మరోవైపు అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు ఆదిలాబాద్, ములుగు, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల,జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
రేపు కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్, హన్మకొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, సంగారెడ్డి, వనపర్తి, వికారాబాద్, ములుగు, నారాయణపేట, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. మరోవైపు ఉరుములు, మెరుపులకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.