)
Telangana Weather Update: అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డిలో పలు చోట్ల భారీ వర్షాలకు పలు కాలువలు, చెరువులకు గండి పడటంతో ఊర్లకు ఊర్లకు రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రెండు మూడు రోజులు పాటు కరెంట్ తో పాటు ఇంటర్నట్ సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అటు వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా ములుగు, మహబూబా బాద్ జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నీళ్లు రూడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అంతేకాదు ఆ ప్రాంతాల్లో రోడ్లన్ని చిత్తడి అయ్యాయి. ఏటూరు నాగారంలోని జంపన్న వాగు ప్రవహించడంతో సమీప ప్రాంతాల్లోని కాలనీలకు రవానా స్థంభించిపోయింది. బొమ్మాయి గూడెం, మొట్లగూడెం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు అల్ప పీడన ప్రభావంతో హనుమకొండ, భూపాలపల్లి, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, జగిత్యాల, మహబూబాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, ములుగు, నిజామాబాద్,వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల మెదక్, నల్లొండ, సిద్ధిపేట, సూర్యాపేట , రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలుకురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడా వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.