Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి, వచ్చే 3 రోజులు 4-5 డిగ్రీలకు ఉష్ణోగ్రత

Cold Waves: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం విభిన్నంగా ఉంది. ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుంటే తెలంగాణలో అందుకు భిన్నంగా చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రెండు మూడు రోజులు చలి మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2024, 09:29 AM IST
Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి, వచ్చే 3 రోజులు 4-5 డిగ్రీలకు ఉష్ణోగ్రత

Cold Waves: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాలోని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం చలి గాలులు తీవ్రమౌతున్నాయి. చలి పులి ప్రతాపం చూపిస్తోంది. రానున్న రోజుల్లో శీతల గాలులు మరింతగా పెరగనున్నాయి. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా చలి ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. డిసెంబర్ 15 వరకూ అంటే మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉండవచ్చని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో చలిగాలులు తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున ప్రజలు వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ధరించాలని వాతావరణ శాఖ సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇంట్లోనే వెచ్చని దుస్తులు ధరించి ఉండాలని తెలిపింది. 

తెలంగాణలోని ఈ జిల్లాల్లో చలి తీవ్రత

రానున్న 2-3 రోజుల్లో తెలంగాణలోని అదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రత కనిష్టంగా 5 డిగ్రీలకు పడిపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించడం గమనార్హం. అటు హైదారాబాద్ నగరంలో డిసెంబర్ 16 వరకూ ఆకాశం మేఘావృతమై చల్లగా ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం నగరంలో ఎక్కువగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకూ పొగమంచు ఎక్కువగా ఉంటున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Also read: Weather Update: బాబోయ్‌.. ఇదేం చలి? భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, తీవ్ర ఇబ్బందులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News