Telangana Weather: రానున్న 5 రోజులు తస్మాత్ జాగ్రత్త, తీవ్రమైన ఎండలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రానున్న 5 రోజులు మరింత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2025, 08:56 PM IST
Telangana Weather: రానున్న 5 రోజులు తస్మాత్ జాగ్రత్త, తీవ్రమైన ఎండలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Weather: ఏపీ, తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రత భారీగా పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 44-45 డిగ్రీల వరకు ఉంటోంది. రానున్న5 రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలోని పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. 

Add Zee News as a Preferred Source

దాదాపు వారం పదిరోజుల క్రితం అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం తిరిగి వేడెక్కుతోంది. రెండు రాష్ట్రాల్లో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మే నెల రాకముందే పగటి ఉష్ణోగ్రత 44-45 డిగ్రీలకు చేరుకుంటోంది. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా  పెరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాంతో వచ్చే ఐదు రోజులు తెలంగాణలోని ఈ 16 జిల్లాల్లో ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరగనుంది. ముఖ్యంగా అదిలాబాద్, నల్గొండ, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 

ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు పడవచ్చు. వర్షాలు పడేటప్పుడు ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి పరిస్థితుల్లో ఆరుబయట, పొలాల్లో, చెట్లు, టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది. 

రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. అటు వడగాలుల తీవ్రత కూడా ఉంటుంది. ఈ క్రమంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. 

Also read: Supreme Court vs Parliament: న్యాయవ్యవస్థ వర్సెస్ పార్లమెంట్ ఏది గొప్పది, సుప్రీంకోర్టును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News