Rain Alert: గుడ్‌న్యూస్, రేపట్నించి 3 రోజులు భారీ వర్షాలు, ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ

Rain Alert: మండుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ నుంచి కూల్ న్యూస్ అందింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 03:51 PM IST
Rain Alert: గుడ్‌న్యూస్, రేపట్నించి 3 రోజులు భారీ వర్షాలు, ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ

Rain Alert: మార్చ్ నెలలోనే ఎండలు పీక్స్‌కు చేరడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఓ వైపు ఎండలు, ఉక్కపోత మరోవైపు వడగాలులతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఐఎండీ నుంచి బిగ్ రిలీఫ్ లభిస్తోంది. రాష్ట్రంలో రానున్న 3-4 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Add Zee News as a Preferred Source

తెలంగాణకు బిగ్ అలర్ట్. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న 3-4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడనన్నాయి. మరో 3-4 రోజుల్లో పడనున్న వర్షాలతో తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ మార్చ్ 20వ తేదీన రాష్ట్రంలోని అదిలాబాద్, నిర్మల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. 

మార్చ్ 21 శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇవి తప్పించి మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక మార్చ్ 22 శనివారం నాడు ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక మార్చ్ 23న కూడా కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు కూడా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 

Also read: Betting Apps Case: మొన్న డ్రగ్స్..ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మాఫియాలో చిక్కుకున్న టాలీవుడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News