Rain Alert: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాధారణం సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. మద్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత తగ్గడం లేదు. మరి కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణకు వర్షసూచన జారీ కావడం విశేషం.
తెలంగాణ ప్రజలకు నిజంగానే గ్రేట్ న్యూస్. హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. మరో మూడ్రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. మార్చ్ 22 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్‌లో మూడు రోజులు వాతావరణం భిన్నంగా ఉండనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడనున్నాయి. మార్చ్ 22, 23, 24 తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ వాతావరణం చల్లబడనుంది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలగనుంది.
రాష్ట్రంలోని ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, గద్వాల్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా మార్చ్ 22, 23 తేదీల్లో వర్షాలు పడనున్నాయి. నిర్మల్, ఆసిఫాభాద్, జగిత్యాల, సిరిసిల్ల, హనుమకొండ, సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వానలు, బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి.
Also read: Teachers Transfers Act: టీచర్లకు శుభవార్త, ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం, బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









