Telgangana Rains: దేశ వ్యాప్తంగా ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల నీటి ఆవిరి నేపథ్యంలో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. ఇదంత సర్వ సాధారణమే అని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటి తెలంగాణతో పాటు హైదరాబాద్ లో గత రెండు మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అసలు వాన జాడ లేదు. ఇలా కొన్ని చోట్ల వర్షాల వల్ల రైతులు, ప్రజలకు తీవ్ర కడగండ్లను మిగుల్చాయి.
వర్షాల వల్ల ఆ ఒక్క పూటే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గినట్టు కనిపించినా.. మళ్లీ భానుడు తన ఉగ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పగలు ఇంట్లో ఉక్కబోత.. బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకున్నాయి. అయితే వాతావరణ మార్పుల వలన తెలంగాణలో మరో మూడు రోజులు పాటు ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రోజు వరంగల్ తో పాటు మేడ్చల్ జిల్లాలో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందంటోంది. వానలుకు తోడు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పొద్దంతా తీవ్రమైన ఎండలు దిమాగ్ ఖరాబ్ చేస్తుండగా , సాయంత్రానికి వానలు పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సాధారణం కంటే 40-44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇవి సాధారణం కంటే చాలా ఎక్కువ అని వాతావరణ కేంద్రం అధికారులు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









