Telangana Rains: బిగ్ అలర్ట్.. వచ్చే మూడు రోజులు వానలే వానలు..

Telangana Rains:తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2025, 09:14 AM IST
Telangana Rains: బిగ్ అలర్ట్.. వచ్చే మూడు రోజులు వానలే వానలు..

Telangana Rains: శుక్రవారం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసన వర్షాలతో జన జీనవం స్తంభించి పోయింది. ఇక రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు  30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Add Zee News as a Preferred Source

మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజ్‌గిరీ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.

మరోవైపు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ను కూడా ఆకాల వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి వుంటుందని భారత వాతావరణ కేంద్రం బాంబు ‌ పేల్చించింది. తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలి సుడులు వస్తాయని  హెచ్చరించింది.  

ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం వుందని , ప్రజలు జాగ్రత్తగా వుండాలంటూ అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. పగలు ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది‌.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News