Rains In Hyderabad: హైదరాబాద్‌లో కొన్ని గంటల్లో కుండపోత వర్షం..!. ఈ ప్రాంతాల వారు బీ అలర్ట్..!

Heavy rains in Hyderabad: భాగ్య నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో మరికొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షంకురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రజలకు అలర్ట్ ను జారీ చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2025, 07:26 PM IST
  • హైదరబాద్ లో భారీ వర్షం..
  • అప్రమత్తమైన అధికారులు..
Rains In Hyderabad: హైదరాబాద్‌లో కొన్ని గంటల్లో కుండపోత వర్షం..!. ఈ ప్రాంతాల వారు బీ అలర్ట్..!

Heavy rain fall alerts in Hyderabad: ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో ఒక వైపున భానుడు భగ భగ మండిపోతున్నాడు. మరోవైపున వానలు కూడా జోరుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వాతావరణ శాఖ అధికారులు చేసే సూచనలను పాటిస్తుంటారు. అదే విధంగా ఐఎండీ అధికారులు ఎప్పటికప్పుడు.. ప్రజలకు ఎండలు, వర్షాల గురించి ముందస్తు సూచనలు చేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది తెలంగాణ వెదర్ మ్యాన్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ కొన్నిసార్లు జరక్కపోయిన.. తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పింది చెప్పినట్లు వాతావరణం విషయంలో తప్పకుండా జరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే సోషల్ మీడియాలో వెదర్ మ్యాన్ కు ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.ఈ నేపథ్యంలొ ప్రస్తుతం తెలంగాణ వెదర్ మ్యాన్ హైదరాబాద్ కు రానున్న రెండు గంటల్లో ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తుందని అలర్ట్ ను జారీ చేశాడు.

ముఖ్యంగా..  లింగం పల్లి, పటాన్ చెరు, మియాపూర్ , కొండాపూర్, హఫీజ్ పేట్, గచ్చి బౌలీ,  కూకట్ పల్లి, మాదాపూర్, జెఎన్ టీయూ, హైటెక్ సిటీ మొదలైన ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని అలర్ట్ ను సోషల్ మీడియా వేదికగా జారీ చేశాడు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కడ కూడా ఇరుక్కొకుండా జాగ్రత్తలు తీసుకొవాలని కూడా పలు సూచనలుచేశాడు. ఒకవైపు ఆఫీసుల నుంచి చాలా మంది సాయత్రం వేళ  ఇంటికి వెళ్తుంటారు.

ఈ క్రమంలోనే సాయంత్రం వేళ కుండపోతగా వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.మరోవైపు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు , జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడ కూడా ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా చర్యలుతీసుకుంటున్నారు. ప్రజలు మ్యాన్ హోళ్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

Read more: Smita Sabharwal: కంచ భూముల వివాదం.. పోలీసులకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఏమన్నారంటే..?

 వర్షం పడుతున్నప్పుడు.. కరెంట్ స్తంభాలను తాకొద్దని కూడా చెబుతున్నారు. కొంత మంది నీళ్లు పొవడానికి వర్షం పడినప్పుడు మ్యాన్ హోళ్లను తెరుస్తారు. ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయోద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం మండుతున్న ఎండలో వర్షాలుకురుస్తుండటంతో ప్రజలు అనేక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News