)
Telugu States Irrigation Projects: భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. మరో వైపు సబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. ఇప్పటికే వర్షాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. మరో నాలుగు రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు జిల్లాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవటంతో ఈ సీజన్లో మూడోసారి గేట్లు ఎత్తేశారు. శ్రీశైలంలోకి లక్షా 66వేల 957 క్యూసెక్కులు కాగా..అవుట్ ఫ్లో 2 లక్షల 28 వేల 601 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.3520 టీఎంసీలుగా ఉంది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 23 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. నాగార్జున సాగర్ నుంచి 3వేల 442 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుండగా ఎగువన కురుస్తున్న వర్షాలకు 13 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రిజర్వాయర్ నుంచి ఔట్ ఫ్లో ద్వారా వరద నీటిని పాలేరు ఏటిలోకి విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌కు ఇంకా వరదనీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెపుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80 శాతం చెరువులు నిండాయని ఎస్.ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన కడెం ప్రాజెక్ట్ అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4వేల 358 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 12వేల 169 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా..ప్రస్తుతం నీటి మట్టం 694.975 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.505 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
అటు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటే ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ లెవల్ .. +514.75 మీటర్లు ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 513.36 మీటర్లుగా ఉంది. దీంతో నీటిని దిగువకు విడుస్తున్నారు. ప్రస్తుతం టాంక్ బండ్ కు ఇన్ ఫ్లూ 580 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లూ 869 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.