TG Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు 2025 త్వరలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం వ్యాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఏప్రిల్ నెలాఖరులో ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in.ద్వారా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్ పరీక్షలు రాసి విద్యార్ధులు తమ ఫలితాలు, మార్క్స్ మెమో కోసం tgbie.cgg.gov.in. వెబ్‌సైట్ సంప్రదించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు మార్చ్ 5 నుంచి 24 వరకు జరగగా, ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 6 నుంచి 25 వరకూ జరిగాయి. ప్రస్తుతం విద్యార్ధులంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 24-30 మధ్యలో ఫలితాలు వెలువడవచ్చని తెలుస్తోంది.
2022లో ఇంటర్ ఫలితాలు జూన్ 28వ తేదీన విడుదల కాగా, 2023లో మే 9 న విడుదలయ్యాయి. ఇక గత ఏడాది 2024లో ఏప్రిల్ 4న విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలను సులభంగా బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in. ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీపై కన్పించే ఇంటర్ మొదటి సంవత్సరం - రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే మీ ఫలితాలు ప్రత్యక్షమౌతాయి. మార్క్స్ మెమో కూడా డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవచ్చు.
Also read: School Holidays: విద్యార్ధులకు బంపర్ న్యూస్, ఏప్రిల్‌లో అన్నీ సెలవులే, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









