TG Inter Results 2025 Latest Updates: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు వెల్లడికావడంతో తెలంగాణలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేరోజు ప్రకటించనున్నట్లు తెలిపారు. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలను https://tgbie.cgg.gov.in/ ద్వారా ప్రకటించనుంది.
ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మార్చి 18వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో మూల్యాంకన నిర్వహించగా.. ఏప్రిల్ 10వ తేదీతో ముగిసింది. ఇప్పటికే మార్కులను ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయగా.. రెండు స్థాయిల్లో పరిశీలించిన అనంతరం రిజల్ట్స్‌ను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 20 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ తరువాత వారం రోజుల్లో ఫలితాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. గతేడాది తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న వెల్లడించారు. అంతకముందు 2023లో మే 9వ తేదీన, 2022, 2021లో జూన్ 28న ఫలితాలను ప్రకటించారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
==> ముందుగా https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
==> ఫస్టియర్ లేదా సెంకడియర్ ఫలితాలపై క్లిక్ చేయండి.
==> కేటగిరీ, ఎగ్జామినేషన్ టైప్ ఎంచుకోండి. హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. PDF ఫైల్ సేవ్ చేసి పెట్టుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
Note: విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితాలపై మీకు అనుమానం ఉంటే.. రీవాల్యూయేషన్ కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి నిరాశకు గురికాకండి. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సమయంలో మరింత కష్టపడి చదివి ఉత్తీర్ణులు అవ్వండి.
Also Read: Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..
Also Read: Telangana Rains: అకాల వర్షంతో అంతా ఆగమాగం.. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









