TGPSC Group 1 Mains Results: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూపు 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఫలితాలు కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలు త్వరలో విడుదల చేయనుంది. 563 పోస్టుల గ్రూపు 1 పోస్టుల భర్తీ ప్రభుత్వం చేపట్టగా.. ఈ ప్రక్రియలో కీలకమైన మెయిన్స్ ఫలితాలు విడుదల కావడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు వచ్చిన మార్కులను చూసి ఉద్యోగం వస్తుందా? లేదా? అని లెక్కలు వేసుకుంటున్నారు.
Also Read: IPL Match Tickets: ఐపీఎల్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లపై వివాదం.. హెచ్‌సీఏ క్లారిటీ ఇదే!
తెలంగాణలో 563 గ్రూపు 1 ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ ముగిసి గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫలితాలతో గ్రూపు 1 పోస్టుల తుది నియామక ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే పరీక్ష ఫలితాల్లో వచ్చిన మార్కులపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ కోరవచ్చు. ఆ రీకౌంటింగ్ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో తుది జాబితా కమిషన్ వెల్లడించింది. తుది ప్రక్రియ ముగియడానికి జూన్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. గ్రూప్ 1 తుది నియామకం పూర్తయిన తర్వాత ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫలితాలు చెక్ చేసుకోవడం ఇలా..
- అభ్యర్థి మెయిన్స్ పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం చాలా సులువు. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడీ నంబర్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్, పుట్టినతేదీ వివరాలు పొందుపర్చాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన అనంతరం మార్కులను పొందవచ్చు.
- హాల్ టికెట్ నంబర్ తెలియకపోతే 'నౌ యువర్ హాల్ టికెట్' ఆప్షన్‌కు వెళ్లాలి. అక్కడ అడిగిన వివరాలన్నీ నమోదు చేస్తే అనంతరం మీ హాల్ టికెట్ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









