TGPSC Group 3 Results: తెలంగాణ గ్రూప్‌ -3 ఫలితాలు విడుదల.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే!

TGPSC Group 3 Results Released Checkout: టీఎస్‌పీఎస్సీ వరుసగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుండగా ఈ క్రమంలోనే గ్రూపు 3 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఆ ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 14, 2025, 05:05 PM IST
TGPSC Group 3 Results: తెలంగాణ గ్రూప్‌ -3 ఫలితాలు విడుదల.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే!

TGPSC Group 3 Results: తెలంగాణలో జరిగిన పోటీ పరీక్షల ఫలితాలు ఒక్కోటీ విడుదల అవుతున్నాయి. ఇటీవల గ్రూపు 1, గ్రూపు 2 ఉద్యోగాల ఫలితాలు విడుదలవగా.. తాజాగా గ్రూపు 3కి సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను విడుదల చేయడంతో ర్యాంకర్ల జాబితాను కూడా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వదిలింది. ఫలితాలు వెలువడడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంపికయ్యామో లేదో అని ఆత్రంగా ఫలితాలను చూసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Agniveer Recruitment: ఏపీవాసులకు శుభవార్త.. సైన్యంలో చేరడానికి అగ్నివీర్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌ -3 ఫలితాలు  ఎట్టకేలకు విడుదలయ్యాయి. గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన గ్రూపు 3 పరీక్షలు ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. వాటితోపాటు గ్రూప్‌-3 పరీక్ష తుది కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లతో పాటు ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ సౌలభ్యం కూడా కల్పించింది. వాటి కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంది.

Also Read: GST Notice To Labour: జీఎస్టీ నోటీసులు చూసి కూలీ షాక్‌.. రూ.22 లక్షల జీఎస్టీ ఏంది సామి

రాష్ట్రంలో 1,365 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాదపు వెయ్యిన్నర పోస్టులకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది మాత్రమే హాజరవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా వాటికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. త్వరలోనే హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల ఫలితాలు, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను కమిషన్‌ త్వరలో విడుదల చేయనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News